లీడర్ న్యూస్ :- తణుకు పట్టణంలోని తేతలి వై జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గమనించారు. వెంటనే స్పందించి, ప్రమాదంలో గాయపడిన పసరపూడి గ్రామానికి చెందిన రమేష్ కి సహాయం అందించి, తక్షణమే ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. అలాగే వైద్యులకు ఫోన్ చేసి, రమేష్ కి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, బాధ్యతతో స్పందించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మానవత్వాన్ని చాటుకున్నారు.